దక్షిణ మధ్య రైల్వేలో 12 డైలీ ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ.. పూర్తి వివరాలివే

South central railway restored these 12 daily passenger trains. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో పేదల రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో రైలు సర్వీసులు పూర్తిగా

By అంజి  Published on  21 July 2022 4:36 AM GMT
దక్షిణ మధ్య రైల్వేలో 12 డైలీ ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ.. పూర్తి వివరాలివే

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో పేదల రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో రైలు సర్వీసులు పూర్తిగా నిలిపివేశారు. కోవిడ్‌ నుంచి కోలుకున్నాక రైలు సర్వీసుల పునరుద్ధరణ జరిగింది. అయితే అది పూర్తి స్థాయిలో మాత్రం జరగలేదు. తాజాగా రైల్వే అధికారులు 12 ప్యాసింజర్‌ రైళ్లు పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.

కరోనాతో పాటు వివిధ కారణాలతో గతంలో రద్దు చేసిన 12 డైలీ ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ పునరుద్ధరించింది. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ సీహెచ్‌.రాకేష్‌ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

1. Train No.07596: కాచిగూడ-నిజామాబాద్ డైలీ ప్యాసింజర్ రైలును ఈ నెల 22 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఈ ట్రైన్ ప్రతీ రోజు 09:50 గంటలకు బయలుదేరి అదే రోజు 13.55 గంటలకు గమ్యానికి చేరుతుంది.

2.Train No.07593: నిజామాబాద్-కాచిగూడ డైలీ ప్యాసింజర్ ట్రైన్ ను సైతం ఈ నెల 22 నుంచి నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 14.55 గంటలకు బయలుదేరి.. అదేరోజు 18.30 గంటలకు గమ్యానికి చేరుతుంది.

3. Train No.07462: సికింద్రాబాద్-వరంగల్ డైలీ ప్యాసింజర్ ట్రైన్ ను సైతం ఈ నెల 25 నుంచి పునరుద్ధరించనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 09:35 గంటలకు బయలుదేరి.. అదే రోజు 13.15 గంటలకు గమ్యానికి చేరుతుంది.

4. Train No.07463: వరంగల్-హైదరాబాద్ ట్రైన్ ను సైతం అదే రోజు అంటే జులై 25 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 13.45 గంటలకు బయలుదేరి.. అదే రోజు 18.05 గంటలకు గమ్యానికి చేరుతుంది.

5. Train No.07979: విజయవాడ-భద్రాచలం డైలీ ప్యాసింజర్ ట్రైన్ ను సైతం ఈ నెల 25 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 07:50 గంటలకు బయలుదేరి.. అదే రోజు 12:50 గంటలకు గమ్యానికి చేరుతుంది.

6. Train No.07278: భద్రాచలం-విజయవాడ ట్రైన్ ను సైతం అదే రోజు నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఆ ట్రైన్ 13.45 గంటలకు బయలుదేరి.. అదే రోజు 18.55 గంటలకు గమ్యానికి చేరుతుంది.

7. Train No.07893: నిజామాబాద్-కరీంనగర్ ట్రైన్ సైతం ఈ నెల 25 నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 04:45 గంటలకు బయలుదేరి.. 07.55 గంటలకు గమ్యానికి చేరుతుంది.

8. Train No.07894: కరీంనగర్-నిజామాబాద్ ట్రైన్ ను ఈ నెల ఈ నెల 25 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 14.35 గంటలకు బయలుదేరి.. 20.40 గంటలకు గమ్యానికి చేరుతుంది.

9. Train No.07765: కరీంనగర్-సిర్పూర్ టౌన్ ట్రైన్ ను ఈ నెల 25 నుంచి నడపనున్నారు. ఈ ట్రైన్ 08:00 గంటలకు బయలుదేరి.. అదే రోజు 11 గంటలకు గమ్యానికి చేరుతుంది.

10. Train No.07766: సిర్పూర్ టౌన్-కరీంనగర్ ట్రైన్ ను ఈ నెల 25 నుంచి నడపనున్నారు. ఈ ట్రైన్ 11.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 14.30 గంటలకు గమ్యానికి చేరుతుంది.

11. Train No.07591: సికింద్రాబాద్-వికారాబాద్ ట్రైన్ ను ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 07.40 గంటలకు బయలుదేరి.. అదే రోజు 09.40 గంటలకు గమ్యానికి చేరుతుంది.

12. Train No.07592: వివకారాబాద్-కాచిగూడ ట్రైన్ ను ఈ నెల 17 నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ ట్రైన్ 10.55 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 13.45 గంటలకు గమ్యానికి చేరుతుంది.

''కోవిడ్‌ లాక్‌డౌన్‌తో పాటు ఇతర కారణాలతో రద్దైన రైళ్లను.. ఒక్కొక్కటిగా పునరుద్ధరణం చేస్తున్నాం'' అని దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

కరోనా కారణంగా 2020 మార్చి 21 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేయడంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయిన విషయం తెలిసిందే. అదే ఏడాది జూన్‌ 10 నుంచి క్రమక్రమంగా రైళ్ల సర్వీసుల పునరుద్ధరణ జరిగింది. తొలుత రిజర్వ్‌డ్‌ టికెట్లు ఉన్న వారినే రైల్వే శాఖ ప్రయాణానికి అనుమతించింది. 2021 డిసెంబరులో ఆ విధానాన్ని ఎత్తివేసి బుకింగ్‌ కౌంటర్ల ద్వారా టికెట్లను విక్రయిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో గత కొన్ని నెలలుగా స్టేషన్లలో కరోనాకు ముందున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల రోజు వారీ ప్రయాణాలు పెరిగాయి.

Next Story