34 ఎంఎంటీఎస్, 15 ప్యాసింజ‌ర్ రైళ్లు ర‌ద్దు

South Central railway cancels multiple trains.భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2022 2:29 AM GMT
34 ఎంఎంటీఎస్, 15 ప్యాసింజ‌ర్ రైళ్లు ర‌ద్దు

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. నేటి(జూలై 14) నుంచి 17 వ‌రకు ప‌లు ప్యాసింజ‌ర్ రైళ్ల‌తో పాటు ఎంఎంటీఎస్ రైళ్ల‌ను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ర‌ద్దు చేసింది. అయితే.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో కొన్ని మార్గాల్లో ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతోంది.

ర‌ద్దైన ప్యాసింజ‌ర్ రైళ్ల వివ‌రాలు ఇవే..

- సికింద్రాబాద్‌-ఉందానగర్‌-సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌ స్పెషల్‌, సికింద్రాబాద్‌-ఉందానగర్‌ మెము స్పెషల్‌, ఉందానగర్‌-సికింద్రాబాద్‌ మెము స్పెషల్‌, మేడ్చల్‌-ఉందానగర్‌ మెము స్పెషల్‌, ఉందానగర్‌-సికింద్రాబాద్‌ మెము స్పెషల్‌, సికింద్రాబాద్‌-ఉందానగర్‌-సికింద్రాబాద్‌ మెము స్పెషల్‌, సికింద్రాబాద్‌-మేడ్చల్‌ మెము స్పెషల్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌ మెము స్పెషల్‌, సికింద్రాబాద్‌-బొల్లారం మెము స్పెషల్‌, బొల్లారం-సికింద్రాబాద్‌ మెము స్పెషల్‌

34 ఎంఎంటీఎస్ రైళ్ల ర‌ద్దు..

హైద‌రాబాద్,సికింద్రాబాద్ మీదుగా న‌డిచే 34 ఎంఎంటీఎస్ రైళ్ల‌ను నేటి నుంచి 17 వ‌ర‌కు ర‌ద్దు చేస్తున్నట్లు ద‌క్షిణ‌మ‌ధ్య‌రైల్వే తెలిపింది. లింగంపల్లి-హైదరాబాద్ రూట్‌లో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య 7, సికింద్రాబాద్-లింగపల్లి రూట్‌లో ఒకటి, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్‌లో ఒక సర్వీసును అధికారులు రద్దు చేశారు.

కొన్ని మార్గాల్లో ప్రత్యేక రైళ్లు..

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07631) సికింద్రాబాద్‌ నుంచి జూలై 16, 23, 30వ తేదీల్లో రాత్రి 11.30 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది. నర్సాపూర్‌-వికారాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెం బర్‌: 07632) నర్సాపూర్‌ నుంచి జూలై 17, 24, 31వ తేదీల్లో రాత్రి 8 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వికారాబాద్‌ చేరుతుంది.

Next Story