ప్రయాణికులకు అలర్ట్‌.. పలు రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లు రద్దయ్యాయి. కాజీపేట మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు.. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.

By అంజి  Published on  6 Feb 2024 8:21 AM IST
South Central Railway, trains,Kazipet, Kakatiya Express

ప్రయాణికులకు అలర్ట్‌.. పలు రైళ్లు రద్దు 

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లు రద్దయ్యాయి. కాజీపేట మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు.. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు. మౌలాలీ - సనత్‌నగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్‌, నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైళ్లను రద్దు చేశారు. సోమవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశామని, మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నామని అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఇంటర్‌ సిటీ(17011/12), కాగజ్‌నగర్‌ సూపర్‌ఫాస్ట్‌ (12757/58), సికింద్రాబాద్‌- గుంటూరు ఇంటర్‌ సిటీ(12705/06) ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌- గుంటూరు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌(12714/13), కాకతీయ ఎక్స్‌ప్రెస్‌(17659/60) పూర్తిగా రద్దు చేశారు. భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌(17233/14)ను, సికింద్రాబాద్‌- గుంటూరు మధ్య నడిచే 17201/02 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట నుంచి బయలుదేరుతాయి.

Next Story