కొంతమంది పోలీసు అధికారులు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనుచరుల్లా పనిచేస్తున్నారు: ఉత్తమ్

Some police officers are working as henchmen of BRS MLAs.. Uttam Kumar Reddy. తెలంగాణలో పోలీసు అధికారులు, అధికార బీఆర్ఎస్ నేతల మధ్య పెరుగుతున్న

By అంజి  Published on  20 Feb 2023 3:30 AM GMT
కొంతమంది పోలీసు అధికారులు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనుచరుల్లా పనిచేస్తున్నారు: ఉత్తమ్

తెలంగాణలో పోలీసు అధికారులు, అధికార బీఆర్ఎస్ నేతల మధ్య పెరుగుతున్న అనుబంధాన్ని కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పలువురు పోలీసు అధికారులు బహిరంగంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్‌ కార్యకర్తలను టార్గెట్‌గా చేసుకుంటున్నారని అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం సర్పంచ్‌ ఇంట్లో జరిగిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల పార్టీ సమావేశానికి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణా రెడ్డి హాజరైనట్లు ఆయన ఓ ఉదాహరణగా చెప్పారు.

స్థానిక బీఆర్ ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇదే సబ్‌ఇన్‌స్పెక్టర్ గత వారం వేర్వేరు తేదీల్లో నక్కగూడెం, పీక్లా నాయక్ తండా, తమ్మవరం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలను అక్రమంగా కొట్టారని తెలిపారు. అలాగే పీక్లా నాయక్‌ తండాకు చెందిన గిరిజనులు, తమ్మవరం గ్రామ కాంగ్రెస్‌ నాయకులపై కూడా గత రెండు వారాలుగా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తప్పుడు కేసులు పెట్టారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సబ్ ఇన్‌స్పెక్టర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో తమ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్న కొంతమంది పోలీసు అధికారులపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. "కొందరు పోలీసు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలను వేధించి తప్పుడు కేసుల్లో ఇరికించిన సందర్భాలను నేను వ్యక్తిగతంగా ఎత్తి చూపాను. అయినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది ప్రమాదకరమైన పోకడని, తక్షణమే ఆపాలి" అని ఆయన అన్నారు.

''సూర్యాపేట ఎస్పీ రాజేందర్ ప్రసాద్, ఇతర జిల్లా స్థాయి అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ, నల్గొండ ఎల్ఎస్ నియోజకవర్గంలోని కొంతమంది పోలీసు అధికారులు స్థానిక ఎమ్మెల్యేల ఉదాసీనతకు మొగ్గు చూపుతున్నారు. పబ్లిక్ డ్యూటీలో యూనిఫాం వేసుకున్నవారిలా కాకుండా స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనుచరులుగా పని చేస్తున్నారు'' అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ కార్యకర్తలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు తప్పుడు పోలీసు కేసులను సాధనంగా ఉపయోగించుకుంటున్నారని టీపీసీసీ మాజీ చీఫ్ అన్నారు. మరో ఉదంతాన్ని ఉటంకిస్తూ హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఓ యువకుడిని తప్పుడు అత్యాచారం కేసులో ఇరికించారని, బీఆర్‌ఎస్‌లో చేరిన వెంటనే అతడిని వదిలేశారన్నారు.

కొందరు స్థానిక పోలీసులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, అనుచరులకు భూకబ్జాలో సహకరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. ఒక ప్రత్యేక సందర్భంలో.. రూ. 100 కోట్ల విలువ గల దాదాపు 46 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానిక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు లాక్కున్నారు. ''భూ కబ్జా గురించి రెవెన్యూ శాఖకు తెలిసిందని, దానికి సంబంధించిన డాక్యుమెంటరీ రుజువు ఉందని స్థానిక ఆర్డీఓ వెంకారెడ్డి నాతో అన్నారు. అయితే భూకబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకునేందుకు స్థానిక పోలీసు అధికారులు సహకరించడం లేదని అన్నారని'' తెలిపారు.

స్థానిక ఎమ్మెల్యే ఆదేశానుసారం స్థానిక పోలీసు అధికారులు భూ వివాదాలకు పాల్పడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పోలీసు అధికారులు ఏ పార్టీ పట్ల అభిమానం చూపకుండా రూల్ బుక్ ప్రకారం విధులు నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. బట్టబయలు అయినప్పటికీ, పోలీసు అధికారులు తమ రాజకీయ ఒరవడిని బహిరంగంగా చూపించడానికి భయపడటం లేదు, ఎందుకంటే వారి సీనియర్లు ఎటువంటి చర్యలు తీసుకోరు. కొందరు పోలీసు అధికారుల తీరు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు తెచ్చిపెడుతుందని అన్నారు.

Next Story