తెలంగాణ రైతులకు శుభవార్త.. వ్యవసాయ రంగానికి పూర్తిగా సౌర విద్యుత్తు!

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

By -  అంజి
Published on : 18 Feb 2026 7:15 AM IST

Telangana Solar Farming, Agricultural Solar Pump Sets, Nalgonda Solar Villages, Anumula Kanagal Mudigonda Solar Project, Free Electricity Telangana Farmers

తెలంగాణ రైతులకు శుభవార్త.. వ్యవసాయ రంగానికి పూర్తిగా సౌర విద్యుత్తు!

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్ అందించే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. దీనివల్ల రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్ అందడమే కాకుండా, ప్రభుత్వానికి విద్యుత్ సబ్సిడీ భారం కూడా తగ్గనుంది. రాష్ట్రంలోని రైతాంగానికి నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం 'సౌర గ్రామాల' కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టింది. సాంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.

తొలి విడతగా నల్గొండ జిల్లాలోని అనుముల, కనగల్‌, ముదిగొండ మండలాలను ఎంపిక చేశారు. ఈ మూడు ప్రాంతాలను పూర్తిస్థాయి 'సౌర గ్రామాలుగా' తీర్చిదిద్దనున్నారు. ఇక్కడ ఒక భారీ సోలార్ పవర్ గ్రిడ్/స్టేషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతాల్లోని 2,000 వ్యవసాయ కనెక్షన్లను నేరుగా ఈ సోలార్ స్టేషన్‌కు అనుసంధానిస్తారు. ఈ పథకాన్ని దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే 5 ఏళ్లలో తెలంగాణలోని అన్ని వ్యవసాయ కనెక్షన్లను (సుమారు 30 లక్షలు) సోలార్ గ్రిడ్‌ పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి క్లస్టర్ లేదా మండల పరిధిలో చిన్న సోలార్ పవర్ స్టేషన్లను నెలకొల్పి, అక్కడి పంపుసెట్లకు విద్యుత్ సరఫరా చేస్తారు.

సోలార్ పవర్ వల్ల రైతులకు పగటిపూట నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ అందుతుంది. దీనివల్ల రాత్రిపూట పొలాలకు వెళ్లే ప్రమాదం తప్పుతుంది. థర్మల్ విద్యుత్ కొనుగోలు భారం తగ్గుతుంది. డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బొగ్గు వాడకం తగ్గి, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. గ్రిడ్‌పై ఒత్తిడి తగ్గి, లో-వోల్టేజ్ సమస్యలు పరిష్కారమవుతాయి.

Next Story