ప్రణీత్‌ హనుమంతుపై పోక్సో కేసు, 14 రోజుల రిమాండ్

ప్రణీత్‌ హనుమంతుతో పాటు లైవ్‌ చాటింగ్‌లో పాల్గొన్న ముగ్గురు నిందితులపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

By Srikanth Gundamalla  Published on  11 July 2024 1:15 PM GMT
praneeth hanumanthu, 14 days remand, hyderabad ,

ప్రణీత్‌ హనుమంతుపై పోక్సో కేసు, 14 రోజుల రిమాండ్ 

సోషల్ మీడియాలో ఇటీవల ప్రణీత్‌ హనుమంతు పేరు ఎక్కువగా వినిపించింది. కూతురు, తండ్రి వీడియోపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు గాను పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు ప్రణీత్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం, పోలీసులు ముందడుగు వేసి ప్రణీత్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టంతో పాటు 67B ఐటీ యాక్ట్, భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్లు 79, 294 ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రణీత్‌ హనుమంతుతో పాటు లైవ్‌ చాటింగ్‌లో పాల్గొన్న ముగ్గురు నిందితులపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో A2గా డల్లాస్ నాగేశ్వర్ రావు, A3గా బుర్రా యువరాజ్, A4 సాయి ఆదినారాయణ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం యూట్యూబ్ ప్రణిత్ హనుమంతు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదుపులో ఉన్నాడు. బుధవారం బెంగళూరు నుంచి పిటి వారెంట్‌పై పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి హైదరాబాకు తీసుకొచ్చారు. హనుమంతును విచారించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఈ మధ్యాహ్నం నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. విచారణ జరిపిన న్యాయస్థానం ప్రణీత్‌ హనుమంతుకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఆ తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు.

Next Story