సిద్దిపేట జిల్లాలో రోడ్డుప్రమాదం, ముగ్గురు విద్యార్థులు మృతి

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on  12 Sept 2023 6:15 PM IST
Siddipet, Road Accident, Three Students, Dead,

సిద్దిపేట జిల్లాలో రోడ్డుప్రమాదం, ముగ్గురు విద్యార్థులు మృతి

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదతీవ్రత ఎక్కువగా ఉండటంతో రోడ్డు మొత్తం రక్తసిక్తంగా మారింది.

చిన్న కోడూరు మండలం అనంత సాగర్ పెట్రోల్ బంక్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే.. 8 మంది విద్యార్థులతో వెళ్తున్న క్వాలిస్ వాహనం రహదారిపై అత్యంత వేగంగా వచ్చింది. బంకు వద్ద కూడా అదే వేగంతో వెళ్లింది. అదుపు తప్పి అక్కడ నిలిపివున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బంక్‌ సిబ్బంది.. ఇతర వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. త్వరగా ప్రమాద స్థలికి చేరుకున్న అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

అత్యంత వేగంగా రావడంతో ప్రమాదతీవ్రత పెరిగిందని చెబుతున్నారు స్థానికులు. కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైందని.. ముందు సీట్లో ఇరుక్కున్నవారి పూర్తిగా ఇరుక్కుపోయారని చెప్పారు. గడ్డపారల సాయంతో వారిని బయటకు తీసినట్లు చెప్పారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. గాయపడ్డవారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

Next Story