సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత, ఎమ్మెల్యే హరీశ్‌రావు సీరియస్

సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సీరియస్ అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  17 Aug 2024 12:00 PM IST
siddipet, harish rao ,tweet, attack, mla camp office,

సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత, ఎమ్మెల్యే హరీశ్‌రావు సీరియస్ 

సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. పోలీసుల సమక్షంలోనే ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం కాంగ్రెస్‌ పాలనకు నిదర్శనం ఆయన మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే ఇక సామాన్య ప్రల పరిస్థితి ఏంటని ఎమ్మెల్యే హరీశ్‌ రావు ప్రశ్నించారు. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు దుండుగులను రక్షించారనీ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎటు పోతున్నాయంటూ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి.. తాళాలు పగులగొట్టి ప్రభుత్వ ఆస్తిని ధ్వసం చేయడం దారుణమని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండుగలను రక్షించారని చెప్పారు. వెంటనే ఈ ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానంటూ ఎమ్మెల్యే హరీశ్‌రావు ట్వీట్‌ చేశారు. కాగా, హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌కార్యకర్తల దాడి నేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ కార్యర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వస్తుండటంతో పోలీసులు అక్కడ మోహరించారు.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని తీసుకుని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి కాంగ్రెస్ నాయకులు బైక్ ర్యాలీగా బయలుదేరారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ ఎందుకు ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నించారు. ర్యాలీగా వెళుతున్న సిద్దిపేట కాంగ్రెస్ ఇంచార్జ్ పూజల హరికృష్ణతో పాటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంతో సిద్దిపేటలో ఫ్లెక్సీల వార్ మరింతగా హీట్ పెంచింది. అయితే సిద్దిపేటలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశారు.


Next Story