Telangana: కరెంట్‌ షాక్‌తో అత్తను చంపేందుకు అల్లుడు యత్నం.. భార్యను కాపురానికి పంపట్లేదని..

భార్యను కాపురానికి పంపడం లేదనే కక్షతో ఓ అల్లుడు తన అత్తనే హతమార్చాలని చూసిన ఘటన కలకలం రేపింది.

By -  అంజి
Published on : 13 April 2026 8:46 AM IST

Jagtial Crime News, Attempt to Murder, Family Dispute, Electric Trap Arrest, Jagdevpet Village Incident

Telangana: కరెంట్‌ షాక్‌తో అత్తను చంపేందుకు అల్లుడు యత్నం.. భార్యను కాపురానికి పంపట్లేదని..

భార్యను కాపురానికి పంపడం లేదనే కక్షతో ఓ అల్లుడు తన అత్తనే హతమార్చాలని చూసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా జగదేవ్‌పేట గ్రామంలో జరిగింది. నిందితుడు మల్లారెడ్డి (48), తన భార్య పద్మతో గొడవల కారణంగా ఆమె పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తన భార్యను తిరిగి పంపాలని మల్లారెడ్డి కోరినప్పటికీ, అత్త రాజవ్వ అందుకు అంగీకరించకపోవడమే ఈ గొడవకు ప్రధాన కారణమైంది.

అత్తపై పగ పెంచుకున్న మల్లారెడ్డి, ఆమెను చంపేందుకు ఒక ప్రమాదకరమైన ప్లాన్ వేశాడు. రాజవ్వ నివసించే ఇంటి తలుపులకు రహస్యంగా విద్యుత్ కరెంట్ వైర్లను అమర్చాడు. ఉదయం నిద్రలేచి తలుపులు తెరవగానే ఆమెకు కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు పోవాలని నిందితుడు భావించాడు. అయితే, రాజవ్వ తలుపులు తీయగానే స్వల్పంగా విద్యుత్ షాక్ తగిలి ప్రమాదం నుండి తప్పించుకుంది. అనుమానం వచ్చిన ఆమె పరిసరాలను గమనించగా, అల్లుడు చేసిన కుట్ర బయటపడింది.

తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న రాజవ్వ వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు. చిన్నపాటి కుటుంబ గొడవలు ఒక్కోసారి ఎంతటి తీవ్రమైన నేరాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

Next Story