త్వరలో రాష్ట్రపతిని కలుస్తాను: వైఎస్ షర్మిల

Sharmila Says will meet the President soon. తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు

By Medi Samrat  Published on  25 Feb 2023 5:00 PM IST
త్వరలో రాష్ట్రపతిని కలుస్తాను: వైఎస్ షర్మిల

తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అధికారపక్షం ప్రతిపక్షాలను అణగదొక్కుతోందని.. గవర్నర్ తమిళిసైతో భేటీ అనంతరం షర్మిల వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను వివరించామని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని ..అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ ను కోరినట్లు చెప్పారు. ప్రెసిడెంట్ ముర్మును కలిసి రాష్ట్రంలో పరిస్థితులన్నింటినీ వివరించి.. రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతానని చెప్పారు. ప్రభుత్వ పెద్దలంతా తాలిబాన్లలా వ్యవహరిస్తున్నారని షర్మిల విమర్శించారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు చేస్తోందని.. హైదరాబాద్ నడిబొడ్డున వీధి కుక్కల దాడికి చిన్న పిల్లాడు బలైనా మున్సిపల్ శాఖ మంత్రి స్పందించకపోవడాన్ని షర్మిల తప్పుబట్టారు. బీఆర్ఎస్ లోని గూండాలు పోలీస్ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. 3,800కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న తనపై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని షర్మిల అన్నారు.


Next Story