సిరిసేడు గ్రామంలో ష‌ర్మిల నిరుద్యోగ దీక్ష‌

Sharmila Nirudyoga Deeksha in Sirisedu.వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు షర్మిల కరీంనగర్ జిల్లా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Aug 2021 11:36 AM IST
సిరిసేడు గ్రామంలో ష‌ర్మిల నిరుద్యోగ దీక్ష‌

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ(వైతెపా) అధ్యక్షురాలు షర్మిల కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప‌ర్య‌టించారు. ఇల్లంతకుంట మండలం సిరిసేడుకు చెందిన మ‌హ్మ‌ద్ ష‌బ్బీర్ అనే నిరుద్యోగి ఇటీవ‌ల ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విషయం తెలిసిందే. కాగా.. నేడు వారి కుటుంబ స‌భ్యుల‌ను షర్మిల ప‌రామ‌ర్శించారు. షబ్బీర్‌ తల్లిదండ్రులను ఓదార్చి వారికి అండగా ఉంటామని ష‌ర్మిల‌ భరోసా ఇచ్చారు.

అనంతరం ప‌లువురు నేత‌ల‌తో క‌లిసి సిరిసేడులో నిరుద్యోగ నిరాహార దీక్ష‌లో కూర్చున్నారు. ఈ దీక్ష‌ సాయంత్రం 5 గంటల వరకు కొన‌సాగ‌నుంది. కాగా.. ప్రతి మంగళవారం నిరుద్యోగ వారం-నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలో ష‌ర్మిల‌ పాల్గొంటోన్న విష‌యం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ల‌క్షా 90 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసే వ‌ర‌కు తాను పోరాడుతూనే ఉంటాన‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Next Story