మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న విషయం తెలిసిందే. పార్టీ ఆవిష్కరణకు రెండు తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మే 14న షర్మిల పార్టీ ఆవిష్కరణ?.. లేదా జూలై 8న ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.
గతంలో మే 14న ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మే 14నే పార్టీ జెండా అజెండా ప్రారంభిస్తే పాదయాత్రలకు వెళ్లొచ్చని ముఖ్య నేతలు షర్మిలకు సూచించినట్లు సమాచారం. జూలై 8న రాజశేఖర్ రెడ్డి జయంతి కావడంతో ఆ రోజును షర్మిల సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. అయితే జూలై 8 నాటికి ఆలస్యం అవుతుందని ముఖ్యనేతలు చెబుతున్నట్లు తెలియవచ్చింది. కాగా రెండు తేదీల్లో ఒకదానిని ఫైనల్ చేసే ఆలోచనలో షర్మిల ఉన్నట్లు సమాచారం.