ఎంపీ అరవింద్‌పై షర్మిల విమ‌ర్శ‌లు

Sharmila Fires On MP Arvind. తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల బీజేపీ నేత‌, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ప‌రోక్ష విమర్శలు చేశారు.

By Medi Samrat  Published on  26 March 2021 10:06 AM GMT
Sharmila Fires On MP Arvind

తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమైన వైఎస్ షర్మిల శుక్ర‌వారం నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నేతలు, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్టాడుతూ.. బీజేపీ నేత‌, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ప‌రోక్ష విమర్శలు చేశారు.


బీజేపీ ఎంపీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగుతూ.. న‌న్ను గెలిపించిన ఐదు రోజుల‌కే ప‌సుపు బోర్డును తీసుకొస్తాన‌ని మాటిచ్చాడని.. మాట స‌రిపోద‌ని బాండ్ పేప‌‌ర్ మీద కూడా సంత‌కం చేసిచ్చాడని అన్నారు. ప్ర‌జ‌ల‌ను న‌మ్మించాడు.. ధ‌గా చేశాడు.. చివ‌ర‌కు గెలిచాడని.. గెలిచాక‌ తాటాకుకు బ‌దులు ఈత ఆకును ఇచ్చారని ఎద్దేవా చేశారు. ప‌సుపు బోర్డుకు బ‌దులు స్పైసీ బోర్డును ఇచ్చి స‌రిపెట్టుకోమంటున్నార‌ని ఫైర్ అయ్యారు. అల్లర్లపై ఉన్న శ్రద్ధ రైతుల కష్టంపై లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పచ్చటి అడవులు, కుంతాల జలపాతం, తెలంగాణ కాశ్మీర్ మన ఆదిలాబాద్ జిల్లా అని అభివర్ణించారు. జల్ జమీన్ జంగల్ పేరుతో నిజాంకి చుక్కలు చూపిన కొమురం భీం పుట్టిన గడ్డ మన ఆదిలాబాద్ జిల్లా అని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామ చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ, ఉద్యమాన్ని నడిపిన కోదండరామ్ పుట్టిన గడ్డ అదిలాబాద్ అని అన్నారు. జలియన్ వాలా బాగ్‌ను తలపించే ఇంద్రవెల్లి ఘటన ఇంకా మనలను రగిలిస్తూనే ఉందన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చి లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి వైఎస్ అని.. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ఆదిలాబా‎ద్‌కు తలమానికమన్నారు.

అలాగే.. బాసరలో ట్రిపుల్ ఐటీ, నిజామాబాద్‎లో యూనివర్సిటీని వైఎస్ ఏర్పాటు చేశారని షర్మిల తెలిపారు. నిజాం షుగర్ ప్రాజెక్ట్‎ను నడిపించే విధంగా అప్పుడు కేంద్రాన్ని సైతం వైఎస్ ఒప్పించారని.. దేశంలో పసుపు ఉత్పత్తిలో నిజామాబాద్ నెంబర్ వన్ అని పేర్కొన్నారు.



Next Story