ప్రొ.జయశంకర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 20 మంది సీనియర్లపై చర్యలు
Seniors ragging juniors in professor jayashankar university. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లను హాస్టల్‌కు పిలిపించిన
By అంజి Published on 29 July 2022 8:15 AM GMTప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లను హాస్టల్‌కు పిలిపించిన సీనియర్లు.. ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలకు పాల్పడ్డారు. వారి ఆగడాలను భరించలేకపోయిన జూనియర్లు ప్రిన్సిపల్ నేతృత్వంలోని యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఆధారలతో సహా కంప్లైంట్ చేశారు. ఆధారాలను పరిశీలించిన కమిటీ సభ్యులు 20 మంది సీనియర్లపై చర్యలు తీసుకున్నారు. వారిలో 13 మందిని కాలేజీ, హాస్టల్ నుంచి సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు. మరో ఏడుగురిని ఒక సెమిస్టర్ నుంచి రస్టిగేట్ చేశారు. ర్యాగింగ్ వ్యవహారంపై ఇంచార్జి వీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ల హాస్టల్‌లోకి సీనియర్లు వెళ్తే కేర్ టేకర్లను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. స్టూడెంట్స్ ఫిర్యాదుపై యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ వెంటనే స్పందించాలన్నారు. రస్టిగేట్ అయినవారిలో ఉప్పు పవన్, అర్తం గణేశ్, సురేష్, కార్తీక్, నాగరాకేశ్ రెడ్డి, వెంకట గౌతమ్ కృష్ణ, వికాస్ ఉన్నారు.
ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోగల మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీలో చదువుతున్న జూనియర్ విద్యార్థుల బృందం.. తమ సీనియర్లు కొందరు తమను ర్యాగింగ్‌కు గురిచేస్తున్నారని ఆరోపించారు. అసభ్యకరమైన దుర్భాషలాడే చర్యలకు పాల్పడ్డారని , దిండ్లతో శృంగారం చేయాలని వేధించారని జూనియర్లు తెలిపారు. కాలేజీ క్యాంపస్‌కి ఆనుకుని ఉన్న సీనియర్ విద్యార్థుల అపార్ట్‌మెంట్‌లో ఈ దారుణ ఘటన జరిగినట్లు సమాచారం. విద్యార్థులు యాంటీ ర్యాగింగ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. క్లాస్‌మేట్ పేరు చెప్పి, ఆమెపై కించపరిచేలా వ్యాఖ్యలు చేసి ఒకరినొకరు చెప్పుతో కొట్టుకునేలా సీనియర్లు తమను బలవంతం చేశారని ఆరోపించారు. తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను లాక్కుని సిట్‌అప్‌లు చేయాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఈ ఘటనను సిరీయస్‌గా తీసుకున్న యూజీసీ.. విచారణకు ఆదేశించింది.