టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసిన టీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి, నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతీల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన రెండు ఆడియోలు బయటకు వచ్చాయి. అయితే.. అవి నిజమైన ఆడియోలు కాదో ఇంకా ఎవరూ నిర్థారించలేదు.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రోహిత్ రెడ్డికి 2+2 భద్రత ఉండగా..ఆ సంఖ్యను 4+4 కి పెంచింది. దీంతో పాటు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కూడా ఆయనకు కేటాయించింది.
రోహిత్ రెడ్డి ఇచ్చిన సమాచారంతోనే మొయినాబాద్ ఫాంహౌస్‌పై దాడులు చేసిన పోలీసులు నిందితులను రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆయనకు భద్రత పెంచింది.