సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 10 April 2024 5:30 PM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. అధిక సీట్లను గెలిచేందుకు రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో లాగే సత్తా చాటాలని భావిస్తోంది. ఇక బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత లోక్‌సభ ఎన్నికల ద్వారా గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. బీజేపీ మాత్రం తామే ఎక్కువ సీట్లను గెలుస్తామని దీమా వ్యక్తం చేస్తోంది. ఈక్రమంలోనే ఎన్నికల్లో ఈ పార్టీకి ఎక్కువ సీట్లు దక్కుతాయనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఎన్నికలు జరుగనున్నాయి.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుంచి 2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత గెలుపొందారు. అయితే.. ప్రమాదవశాత్తు కొంతకాలం ముందే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దాంతో.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికల జరగడం అనివార్యమైంది. ఈ క్రమంలోనే ఆ స్థానం నుంచి కూడా అభ్యర్థులను నిలబెట్టేందుకు పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఇక తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు.
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటన చేశారు. పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన తర్వాత దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు, లాస్య నందిత సోదరి నివేదితను కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. సాయన్నతో పాటుగా.. ఇటీవల లాస్య నందిత స్వయాన సోదరి కావడంతో నివేదిత గెలుపు ఖాయమని పార్టీ శ్రేణులు అంటున్నారు.
కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధిగా గైని నివేదిత ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.
— BRS Party (@BRSparty) April 10, 2024
పార్టీ ముఖ్యులు, స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితను అభ్యర్థిగా ప్రకటించారు.
- File Photo pic.twitter.com/h9oidhbQ3L