మహబూబ్‌నగర్ దారుణ ఘటన జరిగింది. ఓ దివ్యాంగుడిని ఛాతీపై తన్నాడో సర్పంచ్. దివ్యాంగుడి పట్ల జులుం ప్రదర్శించాడు. ఈ ఘటన హన్వాడ మండలం పులుపోనిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. ఉపాధి హామీ కూలిడబ్బులు సరిగ్గా రావట్లేదని, ఎక్కడ జాప్యం జరుగుతుందో తెలియజేయాలని పుల్పోనిపల్లికి చెందిన దివ్యాంగుడు కృష్ణయ్య ఇటీవల మండల అధికారులను కలిశాడు. పూర్తి సమాచారం కోసం.. సమాచార హక్కు చట్టం ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ శ్రీనివాసులు గురువారం సాయంత్రం కృష్ణయ్య ఇంటికెళ్లాడు. కృష్ణయ్యను.. అధికారులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని సర్పంచ్ అడిగాడు.
వీడియోలో, సర్పంచ్ వికలాంగుడిని దుర్భాషలాడాడు. సర్పంచ్ నుంచి తండ్రిని కాపాడేందుకు బాధితురాలి కుమారుడు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో కృష్ణయ్యపై సర్పంచ్ దాడి చేశాడు. కాలితో తన్నాడు. అయితే దివ్యాంగుడిపై దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్పీ స్పందించారు. వెంటనే సర్పంచ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని స్థానిక ఎస్సై రవినాయక్‌ను ఆదేశించారు. ఈ మేరకు సర్పంచ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు ఎస్సై తెలిపారు. అలాగే సర్పంచ్‌ను విధుల నుంచి శ్రీనివాసులును సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ వెంకట్రావు వెల్లడించారు. కాగా, దివ్యాంగుడిపై దాడికి పాల్పడిన సర్పంచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దివ్యాంగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు.