పెద్దమ్మతల్లి ఆలయం వద్ద సమంత.. ఆమెతో ఎవరెవరు ఉన్నారంటే..?

Samantha Ruth Prabhu takes blessings at Hyderabad's Peddamma Temple. హీరోయిన్ సమంత బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని సందర్శించారు.

By M.S.R  Published on  15 March 2023 2:19 PM IST
పెద్దమ్మతల్లి ఆలయం వద్ద సమంత.. ఆమెతో ఎవరెవరు ఉన్నారంటే..?

Samantha Ruth Prabhu takes blessings at Hyderabad's Peddamma Temple


హీరోయిన్ సమంత బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని సందర్శించారు. శాకుంతలం సినిమా యూనిట్ తో కలిసి ఆమె అమ్మవారిని దర్శించుకున్నారు. త్వరలో శాకుంతలం సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే పెద్దమ్మతల్లిని ఆ సినిమా యూనిట్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసింది. హీరోయిన్ సమంతతో పాటు డైరెక్టర్ గుణశేఖర్, ప్రొడ్యూసర్ నీలిమ, దేవ్ మోహన్ లు కూడా పూజల్లో భాగమయ్యారు. ప్రకాశ్ రాజ్, అదితి బాలన్, మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల, గౌతమి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాలో తొలిసారిగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బాలనటిగా కనిపించింది.

ఈ చిత్రం ఏప్రిల్ 14న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకి, దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మహాకవి కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను తాను చూశాననీ, అద్భుతంగా వచ్చిందని సమంత ఇటీవలే చెప్పుకొచ్చింది. ఒక గొప్ప ఇతిహాసం జీవం పోసుకుందనీ, గుణశేఖర్ తన హృదయానికి చాలా దగ్గరగా ఈ సినిమాను ఆవిష్కరించారని తెలిపింది. పిల్లలంతా కూడా ఈ మ్యూజికల్ వరల్డ్ ను ప్రేమించడం ఖాయమనీ, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా పవర్ఫుల్ ఎమోషన్స్ ను ఆస్వాదిస్తారని సమంత ఆశాభావం వ్యక్తం చేసింది.


Next Story