Telangana: రైతు రుణమాఫీ కాలేదా..? అయితే ఒక సెల్ఫీ ఫొటో దిగాలి..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  15 Sep 2024 10:41 AM GMT
Telangana: రైతు రుణమాఫీ కాలేదా..? అయితే ఒక సెల్ఫీ ఫొటో దిగాలి..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది రైతులకు రుణమాఫీ జరిగింది. కొందరికి మాత్రం కొన్ని కొన్ని సమస్యల కారణంగా ఇది జరగలేదు. దాంతో.. అన్ని రకాలుగా అర్హులు అయి ఉండి రేషన్‌ కార్డు లేని కారణంగా రైతు రుణమాఫీ కాని రైతుల కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ జరుగుతోంది. మండల వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ఆయా రైతుల కుటుంబాలను కలిసి నిర్ధారిస్తున్నారు.

ఇందులో భాగంగా మొదలు రైతు కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒక సెల్ఫీ పొటో దిగాలి. ఆ ఫోటోను అధికారులు వ్యవసాయశాఖ ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అలాగే తమ కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన స్వీయ ధ్రువీకరణ పత్రం కూడా అధికారులు అన్నదాతల నుంచి తీసుకుంటున్నారు. ఈ సెల్ఫీలో కుటుంబ సభ్యులంతా తప్పక ఉండాలి. లేని పక్షంలో కనీసం కుటుంబ పెద్ద అయినా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్ వంటి నగరాల్లో ఉంటున్న రైతులు, కుటుంబ పెద్దలు తమ స్వగ్రామాలకు వచ్చి సెల్ఫీలు దిగి, స్వీయ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. 15 రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని రైతు కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నారు. వారి బంధవులు ఇక్కడ వారి భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇలా విదేశాల్లో ఉన్న రైతులకు సంబంధంచిం వారి వివరాల అధికారులు ప్రస్తుతం పక్కన పెట్టేశారు. మరి వీరి విషయంలో మున్ముందు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Next Story