ఆ రోజే అకౌంట్లలోకి రైతుబంధు డబ్బులు

తెలంగాణలో రైతుబంధు నిధుల పంపిణీపై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  26 Nov 2023 4:45 AM GMT
rythu bandhu, telangana govt, election commission,

ఆ రోజే అకౌంట్లలోకి రైతుబంధు డబ్బులు

తెలంగాణలో రైతుబంధు నిధుల పంపిణీపై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. రైతుబంధు కింద రైతులకు ఇస్తోన్న నగదు బదిలీ చేస్తేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఆ డబ్బులు ఎప్పుడు పడతాయనే దానిపై సందిగ్ధత కొనసాగింది. ఈ పథకం కింద రైతులకు ఎకరానికి రూ.10,000 ఏడాది చొప్పున ఇస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన నిధులు జమ చేసినా.. యాసంగి సీజ్‌ కోసం రెండోవిడత నవంబర్‌లోనే అందాల్సి ఉంది. అయితే.. ఈ లోగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇప్పుడు రైతుబంధు డబ్బులు పంపిణీ చేస్తే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని.. రైతుబంధు నిధుల జమ ఎన్నికలయ్యే వరకు ఆపాలని కోరింది. అయితే.. కాంగ్రెస్‌ విజ్ఞప్తితో మొదట రైతుబంధు నిధుల పంపిణీ వద్దు అన్నా.. ఆ తర్వాత నిధుల పంపిణీకి అవకావం ఇచ్చింది.

ఈ నెల 24వ తేదీనే కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. అయినా ఇంకా డబ్బులు జమకాకపోవడంపై రైతులు ఆరా తీస్తున్నారు. కాగా.. శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా సెలవు దినాలు. దాంతో.. సోమవారం తర్వాతే రైతుబంధు నిధులు జమ అవుతాయి. అంటే మంగళవారం 28వ తేదీన రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతుబంధు ఆర్థిక సాయం ఈ నెల 28వ తేదీలోపే పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ప్రబుత్వాన్ని ఆదేశించింది. దాంతో.. ఆ ఒక్కరోజులోనే రైతుబంధు నిధులు రైతుల అకౌంట్లలో జమ కానున్నాయి. దీనికి అనుగుణంగా వ్యవసాయశాఖ అధికారులు అర్హులైన 70 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. ఆ తర్వాత ఆ ఫైలుని ఆర్థికశాఖకు పంపించారు. దాంతో.. ఈ నెల 28న అంటే మంగళవారం రోజున తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లలో రైతుబంధు నిధులు జమ అవ్వనున్నాయి.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. ఈనెల 28న సాయంత్రం 5 గంటలలోపే అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు. రైతుబంధు పోలింగ్‌కు రెండ్రోజుల ముందే అందుతుండటం అధికార పార్టీ బీఆర్ఎస్‌కు బిగ్‌ బూస్ట్‌ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story