ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు: ఎండీ సజ్జనార్

గణేష్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరామర్శించారు.

By Srikanth Gundamalla  Published on  21 Sep 2024 12:13 PM GMT
ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు: ఎండీ సజ్జనార్

కొందరు దుండగుల చేతిలో దాడికి గురై హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కుషాయిగూడ డిపో డ్రైవర్ దారవత్ గణేష్‌. శనివారం గణేష్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ డ్రైవర్ కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. డ్రైవ‌ర్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఈ సందర్భంగా సజ్జనార్‌ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులపై పోలీస్‌ శాఖ సహకారంతో రౌడీ షీట్స్ తెరుస్తామని అన్నారు.

అప్జ‌ల్ గంజ్ నుంచి ఘ‌ట్‌కేస‌ర్‌కు వెళ్తున్న రూట్ నంబ‌ర్ 231/1 మెట్రో ఎక్స్ ప్రెస్ బ‌స్సులో విధులు నిర్వ‌ర్తిస్తోన్న డ్రైవ‌ర్ గ‌ణేష్‌పై దుండ‌గులు విచ‌క్ష‌ణ‌ర‌హితంగా దాడి చేశారు. ఎలాంటి తప్పు లేకున్నా బస్సును రోడ్డుపై ఆపి సీటులో కూర్చున్న డ్రైవర్‌ను అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషిస్తూ ఆరుగురు తీవ్రంగా కొట్టారు. డ్రైవర్ గ‌ణేష్ కు తీవ్ర గాయ‌ల‌వ‌డంతో డ్రైవ‌ర్ అప‌స్మార‌క స్థిత‌లోకి వెళ్లిపోయాడు. వెంట‌నే అతన్ని తార్నాకలోని ఆర్టీసీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఉస్మానియా యూనివ‌ర్శిటీ వై జంక్ష‌న్ వ‌ద్ద శుక్ర‌వారం జ‌రిగిందీ ఘ‌ట‌న‌.

ఈ ప్రమాదంలో తమ డ్రైవ‌ర్‌ది ఎలాంటి తప్పులేదని, బైక్‌ల‌పై వ‌చ్చి ఉద్దేశపూర్వకంగా దుండగులు దాడికి పాల్పడ్డారని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. దుండ‌గుల‌పై బీఎన్ఎస్‌లోని 109, 132, 352, 351(2), r/w 3(5) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశార‌న్నారు. ఐదుగురు దుండ‌గుల‌ను శ‌నివారం అరెస్ట్ చేశారని ఎండీ సజ్జనార్ తెలిపారు.

Next Story