రేవంత్ సర్కార్‌కు షాకివ్వనున్న ఆర్టీసీ ఉద్యోగులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) యూనియన్ ప్రతినిధులు సమ్మె నోటీసులు ఇచ్చారు.

By Medi Samrat
Published on : 27 Jan 2025 7:27 PM IST

రేవంత్ సర్కార్‌కు షాకివ్వనున్న ఆర్టీసీ ఉద్యోగులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) యూనియన్ ప్రతినిధులు సమ్మె నోటీసులు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బస్ భవన్‌లో ఈడీ మునిశేఖర్‌కు సమ్మె నోటీసులు సమర్పించారు. ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని, 21వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీ డ్రైవర్ల ఉద్యోగాలకు భద్రత కల్పించడం, ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా చూడాలని కూడా ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని కార్మికులు స్వాగతిస్తున్నప్పటికీ, ప్రైవేటీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్రిక్తతలు నెలకొనడంతో బస్‌భవన్‌ వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామన్న హామీ నెరవేరకపోవడం, కొత్త ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉండడం, మహిళలకు ఉచిత బస్సు సర్వీసు వల్ల పనిభారం పెరగడంపై ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story