గాల్లో ఏగిరి పడ్డ నోట్లు.. ఏటీఎం నుండి సినీ ఫక్కీలో నగదు చోరీ.. వీడియో

Rs 19 Lakh Robbery From SBI ATM In Korutla. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దొంగలు హల్‌చల్‌ చేశారు. అర్ధరాత్రి టైంలో సినీ ఫక్కీలో

By అంజి  Published on  16 Jan 2023 7:16 AM IST
గాల్లో ఏగిరి పడ్డ నోట్లు.. ఏటీఎం నుండి సినీ ఫక్కీలో నగదు చోరీ.. వీడియో

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దొంగలు హల్‌చల్‌ చేశారు. అర్ధరాత్రి టైంలో సినీ ఫక్కీలో కోరుట్లలోని ఏటీఎంను పగలగొట్టి నగదు చోరీకి పాల్పడ్డారు. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఏటీఏంలలో ఉన్న నగదును దోచుకుని బాక్స్‌లలో పెట్టుకుని కారులో పారిపోయేందుకు రెడీ అయ్యారు. అయితే అప్పటికే ఏటీఎంలో చోరీ జరుగుతున్న విషయాన్ని ఏటీఎం ప్రత్యేక నిఘా విభాగం పసిగట్టింది. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసింది. దీంతో వారు వెంటనే ఏటీఎం సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే నైట్ పెట్రోలింగ్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

అయితే అప్పటికే డబ్బును పెట్టెల్లో పెట్టుకున్న దొంగలు.. కారులో ఎక్కుతుండగా పెట్రోలింగ్‌ వాహనం అక్కడికి చేరుకున్నది. ఈ క్రమంలోనే ఓ దొంగ చేతి నుంచి డబ్బుల బాక్స్‌ కిందపడిపోయింది. అప్పటికే దొంగలు కారు ఎక్కి పరారయ్యారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న వాహనం దానిని గుద్దేయడంతో అందులో ఉన్న డబ్బు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. సుమారు రూ.19 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏటీఎంతో పాటు సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Next Story