అర్థరాత్రి వైన్‌షాపులో చోరీ.. సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి మరీ..

Robbery in a wine shop in Jagityala district.. Thugs attack security guard. జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు.

By అంజి
Published on : 22 Feb 2023 12:11 PM IST

అర్థరాత్రి వైన్‌షాపులో చోరీ.. సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి మరీ..

జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. మండలంలోని మహాలక్ష్మీ వైన్స్‌ షాపులో పక్కా ప్లాన్‌ ప్రకారం.. అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైన్‌షాపులోని మందుపై కన్నేసిన దొంగలు ప్లాన్‌ ప్రకారం షట్టర్‌ దగ్గరకు వెళ్లారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డుని మాటల్లో పెట్టేందుకు ప్రయత్నించారు. ఇంతో మరో వ్యక్తి వైన్‌షాప్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడు. అతన్ని పక్కకు నెట్టేసి వైన్‌షాపు షట్టర్‌ తాళాలు పగులగొట్టి షాపులోకి చొరబడ్డారు. అడ్డుకున్న వైన్‌షాపు సెక్యూరిటీ గార్డ్‌ మల్లయ్యపై దొంగతనానికి పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు.

సెక్యూరిటీ గార్డ్‌కు తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కౌంటర్ లోని నగదు, మద్యం బాటిళ్లను దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి వైన్స్ షాపు నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కౌంటర్లో క్యాష్ పది, ఇరవై రూపాయల నోట్లు మూడు వేల రూపాయల వరకు మాత్రమే ఉన్నాయని వైన్స్ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు.


Next Story