తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీ వ్యతిరేకిగా మారారని రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు పెంచకపోతే సీఎం రేవంత్ చిట్టా విప్పుతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
బీసీ జనాభాను తక్కువ చేసి చూపించి అన్ని రంగాల్లో.. రిజర్వేషన్లలో అవకాశాలు రాకుండా అడ్డుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే తప్పుల తడకగా ఉందని.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా కులగణనలో బీసీల శాతాన్ని తగ్గించి చూపించారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని అన్నారు.