డైరెక్టర్ ఆర్జీవీపై మహిళా కమిషన్‌కు బర్రెలక్క ఫిర్యాదు

తాజాగా రాంగోపాల్‌ వర్మ బర్రెలక్కపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  29 Dec 2023 11:03 AM IST
rgv, comments,  barrelakka, telangana ,

డైరెక్టర్ ఆర్జీవీపై మహిళా కమిషన్‌కు బర్రెలక్క ఫిర్యాదు 

రాంగోపాల్‌ వర్మ వివాదాస్పద డైరెక్టర్‌ అని అందరికీ తెలిసిందే. ఒకప్పుడు సూపర్‌ హిట్స్ ఇచ్చిన ఆయన..ఈ మధ్య వివాదాస్పద కంటెంట్‌పై మాత్రమే దృష్టిపెడుతున్నారు. అయితే.. తాజాగా రాంగోపాల్‌ వర్మ బర్రెలక్కపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్‌పై బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష తరుఫు లాయర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మపై బర్రెలక్క తరఫున మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్జీవీ వ్యూహం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా 'ఊరు.. పేరు లేని ఆవిడ.. బర్రెలక్కగా చాలా ఫేమస్‌ అయ్యింది' అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే శిరీష తరఫు న్యాయవాది ఆర్జీవీ వ్యాఖ్యలను ఖండించారు.

బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష తరుఫున ఆమె లాయర్‌ ఆర్జీవీపై మహిళా కమిషన్‌లో కంప్లైంట్ చేశారు. రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ.. ఊరు పేరులేని ఆవిడ చాలా ఫేమస్‌ అయ్యిందనీ..ఆమెను కించపరిచారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బర్రెలక్క తరఫు లాయర్ మాట్లాడుతూ.. రామ్‌గోపాల్‌వర్మ బతకాలి అనుకుంటే బ్లూఫిలింస్‌ తీసుకుని బతుకు.. కానీ తమ ప్రాంత బిడ్డలను కించపరిస్తే మాత్రం ఊరుకోబోము అని అన్నారు. జీవితంలో ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్న మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం సబబు కాదన్నారు. అయితే.. ఆర్జీవీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో మరింత పోరాటం చేస్తామని వెల్లడించారు. ఇలాంటి మాటలు వద్దు అనీ.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ నుంచి తరిమికొడతామని బర్రెలక్క తరఫు లాయర్ హెచ్చరించారు.

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష తెలంగాణలోని కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన యువతి. ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగి మరింత ఫేమస్ అయ్యారు. నిరుద్యోగుల కోసం ఆమె పోరాడతానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది ప్రముఖులు బర్రెలక్కకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

Next Story