సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లోని పెద్ద చెరువులో ఓ వ్యక్తి ఏకంగా అనధికారికంగా మూడు అంతస్తుల భవనం నిర్మించాడు. ప్రస్తుతం చెరువు నీరు ఆ భవనం కింది వరకు వచ్చాయి. దీంతో బిల్డింగ్ ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించారని గుర్తించిన రెవెన్యూ శాఖ అధికారులు దాన్ని బాంబుల ద్వారా నేల మట్టం చేశారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు పేలుడు పదార్థాలను ఉపయోగించి అనధికార నిర్మాణాన్ని కూల్చివేశాయి.ఈ క్రమంలోనే శిథిలాలు ఎగిరిపడి ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాదాపు దశాబ్ద కాలం క్రితం సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ భవనాన్ని నిర్మించినట్లు అధికారులు తెలిపారు. అతను సరస్సు ఒడ్డు నుండి భవనంలోకి ప్రవేశించడానికి మెట్లు కూడా నిర్మించాడు.
భవన యజమాని వారాంతాల్లో తన కుటుంబంతో సహా ప్రాంగణాన్ని సందర్శిస్తాడని అధికారులు తెలిపారు.