ఏం పర్లేదు.. వారికి సముచిత స్థానం కల్పిస్తాం: రేవంత్‌

Revanth Reddy's latest comments on Munugodu by-election. మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి

By అంజి  Published on  11 Sep 2022 3:03 PM GMT
ఏం పర్లేదు.. వారికి సముచిత స్థానం కల్పిస్తాం: రేవంత్‌

మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నియమించింది. దీంతో కొందరు నేతలు కాంగ్రెస్‌ నుంచి మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలోనే మునుగోడు టికెట్‌ ఆశించి భంగపడినే నేతలతో జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని రేవంత్ సూచించారు. పల్లె రవి, కైలాష్ నేత, కృష్ణా రెడ్డి మునుగోడు టికెట్ ఆశించారు.

అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా వారిలో ఎవరికీ టికెట్‌ కేటాయించలేదు. దీంతో వారు అసంతృప్తిగా ఉన్నా, పార్టీ నిర్ణయాన్ని గౌరవించడం అభినందనీయమని రేవంత్‌ రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. విభజించు, పాలించు అనే బ్రిటీష్‌ విధానాన్ని అమలు చేస్తోందని రేవంత్‌ మండిపడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెలుతోందని హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలన్నారు.

మునుగోడు బై పోల్‌లో పార్టీని గెలిపించేందుకు నాయకులంతా కృషి చేస్తామని హామీ ఇచ్చారని రేవంత్‌ రెడ్డి తెలిపారు. కృష్ణారెడ్డి, కైలాశ్‌, పల్లె రవిలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు. కేసీఆర్‌ ప్రయత్నాలన్నీ కాంగ్రెస్‌ కూటమిని విచ్ఛిన్నం చేయడానికేనని, మోదీ ఇచ్చిన సుపారీ ఒప్పందంతో కేసీఆర్‌ బీజేపీకి పరోక్షంగా సహకారం అందిస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. మళ్లీ కేసీఆర్ సీఎం అయ్యేందుకు, మోదీ ప్రధాని అయ్యేందుకు టీఆర్ఎస్, బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నాయ‌ని విమర్శించారు.

Next Story