రేవంత్‌రెడ్డి అను నేను.. తెలంగాణ కొత్త సీఎం ప్రమాణస్వీకారం
తెలంగాణ కొత్త సీఎంగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
By Srikanth Gundamalla Published on 7 Dec 2023 8:05 AM GMTరేవంత్‌రెడ్డి అను నేను.. తెలంగాణ కొత్త సీఎం ప్రమాణస్వీకారం
తెలంగాణ కొత్త సీఎంగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్‌రెడ్డి చేత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. రేవంత్‌రెడ్డి అనే నేను తెలంగాణ సీఎంగా తన బాధ్యతలు నెరవేరుస్తానంటూ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణం తర్వాత రేవంత్‌రెడ్డికి గవర్నర్ తమిళిసై పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి తర్వాత భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత మంత్రులుగా వరుసగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు. ఇక తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఏఐసీసీ నియమించిన విషయం తెలిసిందే.
అంతకుముందు కాంగ్రెస్ కార్యకర్తల కేరింతలు మధ్య ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో కలిసి ప్రత్యేక వాహనంలో రేవంత్ వేదిక వద్దకు చేరుకున్నారు. రకరాల పూలతో అలంకరించిన వాహనంలో ఎల్బీ స్టేడియంలోకి వచ్చారు రేవంత్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డితో పాటు మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమంతో సందడి వాతావరణం నెలకొంది.