కేసీఆర్ క్షమాపణ చెప్పాలి : రేవంత్ రెడ్డి

నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి పరకాల అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  20 Nov 2023 11:44 AM GMT
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి : రేవంత్ రెడ్డి

నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి పరకాల అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప‌ర‌కాల ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ పుట్టిన గడ్డ.. అలాంటి ఈ గడ్డను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసే బాధ్యత మాదని తెలిపారు. మచ్చలేని, అవినీతి మరక లేని నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అని స‌భ‌కు హాజ‌రైన ప్ర‌జ‌ల‌తో అన్నారు.

కేసీఆర్ మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదు.. ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపడుతుండు.. దొరల రాజ్యం కావాలా? ఇందిరమ్మ రాజ్యం కావాలా పరకాల ప్రజలు తేల్చుకోవాలన్నారు. ఆనాడు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యం. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5 లక్షలు ఉచితంగా ఇచ్చే రాజ్యం.. ఇందిరమ్మ రాజ్యం అని హామీ ఇచ్చారు.

వేలాది ఎకరాల దొరల భూములను సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు పంచింది ఇందిరమ్మ రాజ్యం అని వివ‌రించారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి ఇందిరమ్మ రాజ్యంలోనే జరిగిందని వెల్ల‌డించారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపట్టిన కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు. సోనియమ్మ మాటంటే శిలాశాసనం.. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చినట్లే.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామ‌న్నారు.

Next Story