Revanth Reddy : రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు ప్రమాదం

రేవంత్‌రెడ్డి కాన్వాయ్ ప్ర‌మాదానికి గురైంది. ఆయ‌న కాన్వాయ్‌లోని ఆరు కార్లు ఒక‌దానికొక‌టి 6 కారు ఢీ కొన్నాయి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2023 12:37 PM IST
Revanth Reddy, Revanth Reddy Convoy

ప్ర‌మాదానికి గురైన కాన్వాయ్‌లోని ఓకారు

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో అప‌శృతి చోటు చేసుకుంది. వేగంగా వెలుతున్న కాన్వాయ్‌లోని ఆరు కార్లు ఒక‌దానికొక‌టి ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ప‌లువురికి స్వ‌ల్పంగా గాయాలైన‌ట్లు తెలుస్తోంది.

ఎల్లారెడ్డిపేట మండలం నుండి తన కాన్వాయ్ లో రామన్నపేటకు బయలుదేరారు రేవంత్ రెడ్డి. తిమ్మాపూర్ వద్ద రేవంత్ కాన్వాయ్ లోని ఆరు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ప్ర‌మాదం ధాటికి కార్ల‌లోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ప్రమాదంలో రేవంత్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కార్ల ముందుభాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇందులో 4 కార్లు కాన్వాయ్‌లోని వాహనాలు కాగా మరో రెండు కార్లు విలేక‌రుల‌కు సంబంధించినవి. ప‌లువురు స్వ‌ల్పంగా గాయ‌ప‌డడంతో వీరిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించిన‌ట్లుగా తెలుస్తోంది.

Next Story