స్టార్‌ క్యాంపెయినర్లుగా రేవంత్‌ రెడ్డి, భట్టి విక్ర‌మార్క‌

రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది

By Medi Samrat  Published on  4 Nov 2024 7:34 PM IST
స్టార్‌ క్యాంపెయినర్లుగా రేవంత్‌ రెడ్డి, భట్టి విక్ర‌మార్క‌

రాబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేర‌కు కాంగ్రెస్ హైకమాండ్ ప్రచార జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం.. రేవంత్‌ రెడ్డి మహారాష్ట్రలో ప్ర‌చార‌ ర్యాలీలలో పాల్గొనాల్సివుండ‌గా.. భట్టి విక్ర‌మార్క‌ జార్ఖండ్‌లో ప్రచారం చేయనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మహా వికాస్ అఘాడి (MVA) కూటమికి ప్రచారం చేయనున్నారు. ఇందులో కాంగ్రెస్, NCP శరద్ పవార్ వర్గం, శివసేన యొక్క ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం ఉన్నాయి. విక్రమార్క జార్ఖండ్‌లో కాంగ్రెస్, జెఎంఎం, ఆర్‌జెడి, లెఫ్ట్ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియా కూట‌మి అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిని మాత్రమే తెలంగాణ నుంచి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చేసింది అధిష్టానం.

Next Story