రేషన్‌ లబ్ధిదారులకు అలర్ట్‌.. ఈ నెల 30 వరకూ బియ్యం పంపిణీ

3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో రేషన్‌ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు తీసుకోకపోతే మళ్లీ 3 నెలల వరకు ఇవ్వరని ప్రజలు రేషన్‌ షాపుల వద్ద బారులు...

By -  అంజి
Published on : 13 April 2026 7:28 AM IST

Ration Distribution, Extension of Deadline, e-POS Technical Glitches, Civil Supplies Department, Three Months Ration Scheme

రేషన్‌ లబ్ధిదారులకు అలర్ట్‌.. ఈ నెల 30 వరకూ బియ్యం పంపిణీ

హైదరాబాద్‌: 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో రేషన్‌ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు తీసుకోకపోతే మళ్లీ 3 నెలల వరకు ఇవ్వరని ప్రజలు రేషన్‌ షాపుల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో ఉయదం నుంచే క్యూలైన్లు కనిపిస్తున్నాయి. సర్వర్‌ సమస్యలు, ఈపోస్‌ మెషీన్లు ఆగిపోవడం, స్టాక్‌ అయిపోవడంతో చాలా మందికి ఇంకా రేషన్‌ అందలేదు. దీంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఈ నెల 30 దాకా రేషన్‌ ఇస్తామని అధికారులు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏప్రిల్, మే, మరియు జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకే విడతలో పంపిణీ చేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది. మూడు నెలల కోటాను ఒకేసారి అందిస్తుండటంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, పంపిణీ ప్రక్రియలో ఎవరికీ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పంపిణీ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం రేషన్ పంపిణీలో సాంకేతిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఈ-పాస్ (e-POS) మెషీన్లు మొరాయించడం, సర్వర్లు నెమ్మదించడం వంటి కారణాల వల్ల హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో లబ్ధిదారులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. సర్వర్లపై ఒత్తిడి పెరగడంతో బయోమెట్రిక్ నమోదులో జాప్యం జరుగుతోంది. ఈ ఇబ్బందులను గమనించిన పౌర సరఫరాల శాఖ, గడువు పొడిగింపు ద్వారా లబ్ధిదారులకు ఊరట కలిగించింది.

ఒకవేళ రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ మెషీన్ల వద్ద వేలిముద్రలు పడకపోయినా లేదా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినా లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. అలాంటి సందర్భాల్లో స్థానిక మండల రేషన్ కార్యాలయాన్ని (MRO office) లేదా పౌర సరఫరాల శాఖ అధికారులను సంప్రదించి తమ సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. గడువు ఉన్నందున లబ్ధిదారులు సంయమనంతో వ్యవహరించాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది.

Next Story