రాజా సింగ్ హీరోగా సినిమా..!
Raja Singh as Hero. రాజా సింగ్.. గోషా మహల్ ఎమ్మెల్యే అయిన ఈయన త్వరలోనే హీరోగా కనిపించబోతున్నారట
By Medi Samrat Published on 28 Feb 2021 4:59 PM ISTరాజా సింగ్.. గోషా మహల్ ఎమ్మెల్యే అయిన ఈయన త్వరలోనే హీరోగా కనిపించబోతున్నారట..! నిజ జీవితంలో పెద్ద ఫైర్ బ్రాండ్ అయిన రాజా సింగ్ హీరోగా కొత్త సినిమా రానుంది. అందుకే బరువు తగ్గాలని నిర్ణయించేసుకున్నారు. 117 కిలోల బరువు ఉండే రాజా సింగ్ ఇప్పటికే 27 కిలోలు తగ్గారట. ఈ మార్పు అంతా ఓ సినిమా కోసం అని.. రాజాసింగ్ హీరోగా నటించనున్నారు. కథ, నిర్మాత, దర్శకత్వం కూడా ఆయనే అని చెబుతున్నారు.
రాజా సింగ్ అది కూడా ఓ బయోపిక్ ను ఎంచుకున్నారు. హిందుత్వాన్ని కాపాడడం కోసం పాటు పడే రాజా సింగ్ ఛత్రపతి శివాజీ కుమారుడు శంబాజీ మహరాజ్ జీవిత కథను ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నారు. శంబాజీ మహరాజ్ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి అని రాజాసింగ్ అన్నారు. శివాజీ మహరాజ్ గురించి అందరికీ తెలుసని, శంభాజీ మహరాజ్ గురించి ఈ తరానికి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇన్ని రోజులు అసెంబ్లీ లోనూ.. న్యూస్ ఛానల్స్ లోనూ సందడి చేసిన రాజా సింగ్ త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్నారు. రాజకీయాల్లో ఎలాగూ తన సత్తాను నిరూపించుకున్న రాజా సింగ్.. ఇక వెండితెర మీద మంచి మార్కులు సంపాదించుకుంటారో లేదో చూడాలి..!