తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. ప్రస్తుత వాతావరణ నమూనాల విశ్లేషణ ప్రకారం ఈ కాలంలో వర్షాలు కురిసే సూచనలు బలంగా ఉన్నాయని, అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అంచనాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా కోత దశలో ఉన్న పంటలు లేదా ఆరబోసిన ధాన్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ మార్పులపై తుది సమాచారాన్ని మార్చి 15న లేదా అంతకంటే ముందే వెల్లడిస్తామని, అంతవరకు రైతులు వాతావరణ అప్‌డేట్‌లను గమనిస్తూ సురక్షితంగా ఉండాలని ఆయన 'X' వేదికగా తెలియజేశారు.