'తెలంగాణ అంటే ఏంటో' ఈ పర్యటనతో అర్ధమైంది: రాహుల్ గాంధీ
Rahul Ghanshi gave a speech in Menoor as part of Bharat Jodo Yatra. భారత్ జోడో యాత్రలో భాగంగా.. తెలంగాణలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో తన యాత్రను
By అంజి Published on 7 Nov 2022 7:30 PM ISTభారత్ జోడో యాత్రలో భాగంగా.. తెలంగాణలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో తన యాత్రను ముగించుకున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. తెలంగాణను విడిచి మహారాష్ట్రకు వెళ్తున్నానని, చాలా బాధగా ఉందని రాహుల్ అన్నారు. తెలంగాణను వీడటం కొంత బాధగానే ఉన్న.. జోడో యాత్రలో భాగంగా వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో నడిచి రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకున్నానన్నారు.
తన పాదయాత్ను ఏ శక్తీ ఆపలేదని, పాదయాత్రలో ఎన్నో విషయాలను గమనించానని తెలిపారు. ఇంజనీరింగ్ చదువులకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తొందని, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను టీఆర్ఎస్ నాశనం చేసిందని విమర్శించారు. దళితులు, గిరిజనుల భూములను టీఆర్ఎస్ లాక్కుంటోందని, తమ పార్టీ కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారో తాన కళ్లారా చూశానని రాహుల్ చెప్పారు. దెబ్బలు తగులుతున్నా భయపడకుండా పనిచేస్తున్నారని ఆయన అన్నారు.
ఈ యాత్రలో తాను అన్ని వర్గాల వారినీ కలుసుకున్నానని, వారి సమస్యలను విన్నానని రాహుల్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని తాను నమ్ముతున్నానన్నారు. తెలంగాణ ప్రజల మనోధైర్యం దేశానికి ఆదర్శంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ఇందిరాగాంధీ తీసుకొచ్చిన స్కీమ్‌లను ఈ ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులు సంతోషకరంగా లేరని రాహుల్ అన్నారు. దెబ్బతిన్నా ఎదురొడ్డి పోరాటం చేయడం తెలంగాణ నైజం అని అన్నారు.
తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు రుణమాఫీ చేస్తామన్నారు. ప్రతి పంటకు సరైన మద్ధతు ధర కల్పిస్తామన్నారు. ఈ సీఎం ఉదయమేమో ఇరిగేషన్ ప్రాజెక్టులపై వచ్చే కమీషన్ల గురించి ఆలోచిస్తాడనని, రాత్రయితే ధరణి పోర్టల్ ఓపెన్ చేసి ఎవరి భూమి లాక్కోవాలో చూస్తాడని రాహుల్ ఆరోపించారు. ఈ సీఎం వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని రాహుల్ అన్నారు. తెలంగాణ అంటే ఏమిటో ఈ పర్యటనతో అర్ధమైందని రాహుల్ గాంధీ చెప్పారు.పాదయాత్రలో తాను చాలా విషయాలు గమనించినట్టుగా తెలిపారు.