హైకోర్టును ఆశ్ర‌యించిన ర‌ఘునంద‌న్ రావు.. ఎందుకంటే..

Raghunandan Rao, who approached the High Court I దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన రెండు రోజుల‌కే

By సుభాష్  Published on  12 Nov 2020 1:13 PM GMT
హైకోర్టును ఆశ్ర‌యించిన ర‌ఘునంద‌న్ రావు.. ఎందుకంటే..

దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన రెండు రోజుల‌కే మాధవనేని రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేట పోలీస్ స్టేష‌న్‌లో న‌మోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ ఆయన క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఎన్నికల సమయంలో రూ.18 లక్షలు లభించాయని కట్టు కథ అల్లారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అక్రమంగా నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును కోరారు. కాగా రఘునందన్ రావు పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మీదకు విచారణకు వచ్చింది. అయితే.. ఎమ్మెల్యేలపై నమోదయ్యే కేసులను ప్రధాన న్యాయమూర్తి ప్రాతినిధ్యం వహించే ధర్మాసనం విచారించాల్సి ఉంటుందన్న కారణంతో రఘునందన్ రావు పిటిషన్‌కు చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేయాలని జస్టిస్ లక్ష్మణ్ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

అస‌లేం జ‌రిగిందంటే..?

గ‌త నెల 26న రెవెన్యూ, పోలీసు అధికారులు సిద్ధిపేట‌లో త‌నిఖీలు చేప‌ట్టారు. ర‌ఘునంద‌న్‌రావు మామ‌, అంజ‌న్‌రావు, మ‌రో వ్యక్తి ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్ర‌మంలో అంజ‌న్‌రావు ఇంట్లో రూ.18.67 ల‌క్ష‌లు లభించాయ‌ని.. ఆ సొమ్మును ఉప ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌కు పంచేందుకు సిద్దం చేసిన‌ట్లు తెలిసింద‌ని.. సిద్దిపేట సీపీ జోయ‌ల్ డేవిస్ తెలిపారు. సోదాల స‌మ‌యంలో పెద్ద ఎత్తున భాజాపా కార్య‌క‌ర్త‌లు అక్క‌డ‌కు చేరుకోవ‌డంతో తోపులాట జ‌రిగింది. ఈ తోపులాట‌లో పోలీసుల చేతిలోంచి రూ.12.80ల‌క్ష‌ల‌ను భాజాపా కార్యాకర్త‌లు లాక్కెల్కిన‌ట్లు సీపీ చెప్పారు. ఇదిలా ఉంటే.. నోట్ల కట్టలు దొరికిన విషయంలో బీజేపీ చేసిన పనేనంటూ టీఆర్ఎస్.. కాదు కాదు అంతా టీఆర్ఎస్సే చేసిందంటూ బీజేపీ ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే.

Next Story