బీజేపీ అభ్యర్థిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాడి.. టీవీ డిబేట్ లైవ్‌లోనే

కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై దాడికి పాల్పడ్డారు.

By అంజి  Published on  26 Oct 2023 3:30 AM GMT
quthbullapur, mla kp vivekananda, kuna risailam goud, Telangana Polls

బీజేపీ అభ్యర్థిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాడి.. టీవీ డిబేట్ లైవ్‌లోనే 

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ భౌతికంగా దాడి చేయడంతో టీవీ లైవ్‌ చర్చ దుమారం రేపింది. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తుతూ ఓ టీవీ ఛానెల్‌ సురారం రామ్‌లీలా మైదానంలో బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ లైవ్‌ వేదికలో ఇద్దరు రాజకీయ నాయకులు భూకబ్జాల ఒకరికొకరు ఆరోపణలు చేసుకున్నారు.

బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం, ఎమ్మెల్యే కేపీ వివేకానంద మధ్య వాడి వేడి చర్చ జరిగింది. .ఇద్దరూ వ్యక్తిగత ఆరోపణలు చేసుకున్నారు. వివేకానంద్‌ తండ్రి భూకబ్జాదారుడని శ్రీశైలం ఆరోపించగా, వివేకానంద్‌ శ్రీశైలం గౌడ్‌పైకి దూసుకెళ్లి అతని పై దాడి చేసే ప్రయత్నం చేశాడు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపులో ఉంది. ఇరు రాజకీయ పార్టీల సభ్యులు వేదికపైకి దూసుకు రావడం, బారికేడ్లను ధ్వంసం చేయడం, కుర్చీలు విసరడం, నినాదాలు చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.

తమ పార్టీ సభ్యుడిపై జరిగిన దాడిని బీజేపీ నేతలు ఖండించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, లేకుంటే కోర్టును ఆశ్రయిస్తాం అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు భూములు కబ్జా చేశారని ఆరోపించారు. గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజా సింగ్ కూడా ఘటనను ఖండిస్తూ, కేపీ వివేకానంద్ దాడి బీఆర్‌ఎస్ నాయకుల నిరాశ, అహంకారాన్ని తెలియజేస్తోందని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోతారనే విషయాన్ని జీర్ణించుకోలేక భౌతిక దాడికి దిగారు.

Next Story