తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ నేతలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజగా.. బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు. 2023లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనను జైలుకు పంపిస్తానని బండి సంజయ్ అంటున్నారని.. కేంద్రంలో ఇప్పుడే బీజేపీ ప్రభుత్వం ఉందని.. తనపై చర్యలు తీసుకోవాలని సవాల్ చేశారు.
బీజేపీ అంటురోగ పార్టీ అని .. దాన్ని అంటించుకోవడానికి ఖమ్మం ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కొందరు టూరిస్టులు వస్తుంటారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఓ బత్తాయి వచ్చింది. ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తొండి సంజయ్ అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో నాలుగు ఓట్ల కోసం ఆయన ఖమ్మంలో పర్యటించారని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ పై కరోనా వ్యాక్సిన్ ను ప్రయోగించామని సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటరిచ్చారు.
ఖమ్మంలో ఎలాంటి వ్యాక్సిన్లు పనిచేయవన్నారు. వ్యాక్సిన్ వేసినా కూడ తిప్పికొట్టేందుకు ఇక్కడ ప్రజలకు బాగా రోగ నిరోధక శక్తి ఉందని ఆయన చెప్పారు. కూకట్‌పల్లి డివిజన్ లో ఏడు కార్పోరేటర్లలో ఆరు గెలుచుకొని బండి సంజయ్ కు తాను వ్యాక్సిన్ వేశానని ఆయన అన్నారు.
.