యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు, ప్రసాదాల ధరల పెంపు
Prasadam and seva prices hiked at Yadadri.తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో
By తోట వంశీ కుమార్
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు, ప్రసాదాల ధరను పెంచారు. కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం తగ్గడంతో స్వామి వారికి జరిపే నిత్య కైంకర్యములు, శాశ్వత పూజలు, భోగములు, స్వామివారి ప్రసాదముల ధరలను పెంచుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఇక పెంచిన ధరలు అనుబంధ ఆలయాలకు వర్తిస్తాయని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. కొన్ని ధరలు100 శాతం పెరగ్గా.. మరికొన్ని 20 నుంచి 80 శాతం పెరిగాయి.
పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి..
నిజాభిషేకం (ఇద్దరికి) గతంలో రూ.500 ఉండగా రూ.800 చేశారు. సహస్ర నామార్చనకు రూ.216 నుంచి రూ.300, సుదర్శన నారసింహ హోమానికి రూ.1,116 నుంచి రూ.1,250, నిత్య కల్యాణోత్సవానికి రూ.1,250 నుంచి రూ,1,500, స్వాతి నక్షత్రం రోజున నిర్వహించే శత ఘటాభిషేకానికి (ఇద్దరికి) రూ.750 ఉండగా.. రూ.1,000,లక్ష పుష్పార్చనకు రూ.2,116 ఉండగా రూ.2,500, వెండి మొక్కు జోడు సేవలకు రూ.500 ఉంటే రూ.700, సువర్ణ పుష్పార్చనకు రూ.516 ఉంటే రూ.600, వేదాశీర్వచనం రూ.516 ఉంటే రూ.600, ఆండాల్ అమ్మవారి ఊంజల్ సేవకు రూ.750 నుంచి రూ.1000కి పెంచారు,
సత్యనారాయణస్వామి వ్రతాలు (సామగ్రితో కలిపి) రూ.500 నుంచి రూ.800 కి, గో పూజకు రూ.50 ఉంటే రూ.100, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలకు వీఐపీల కోసం ప్రత్యేకంగా రూ.1,500, ఉపనయనం రూ.50 నుంచి రూ.500, అక్షరాభ్యాసం రూ.51 ఉంటే రూ.200, అష్టోత్తర పూజకు రూ.100 ఉంటే రూ.200, అన్నప్రాశన (ఐదుగురికి) రూ.500 ఉంటే రూ.1000కి పెంచారు.
పెరిగిన ప్రసాదం ఇలా..
వంద గ్రాముల లడ్డూ గతంలో రూ.20 ఉంటే రూ.30కి, 500 గ్రాముల లడ్డూ రూ.100 ఉంటే రూ.150, 250 గ్రాముల పులిహోర రూ.15 ఉంటే రూ.20, 250 గ్రాముల వడ రూ.15 ఉంటే రూ.20కి పెంచారు.