హైకోర్టుకు వెళ్లకుండా.. వైఎస్ షర్మిలను అడ్డుకున్న పోలీసులు
Police stop YS Sharmila from leaving home for TS High Court. హైదరాబాద్: ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ
By అంజి Published on 13 Dec 2022 10:14 AM GMTహైదరాబాద్: ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను ఇంటి నుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్‌లో వైఎస్‌ఆర్‌టీపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాదయాత్ర ఆగింది. అయితే ఆ తర్వాత నర్సంపేట నుంచి షర్మిల పాదయాత్రను చేపట్టేందుకు నవంబర్ 29న తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
''హైకోర్టు పాదయాత్ర చేసుకునేందుకు అనుమతి ఇచ్చినా.. సీఎం కేసీఆర్ పోలీసుల భుజనా తుపాకీ పెట్టి పాదయాత్ర చేసుకోనివ్వకుండా అని ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ సీపీ పాదయాత్ర చేసుకోవడానికి వీలు లేదని చెప్పిన తర్వాత మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ రోజు నేను కోర్టుకు వెళ్దామని అడుగు బయటపెడదామంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎందుకు అని ప్రశ్నిస్తున్నాను. సీఎం కేసీఆర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ఎంతలా వాడుకుంటున్నారంటే.. కనీసం వాళ్ల ఇంట్లో పని మనుషులకైనా ఇంత కన్నా ఎక్కువే మర్యాద ఉంది. ఇది ప్రజాస్వామ్యమేనా.. ఇదెక్కడి న్యాయం'' అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
నర్సంపేట ప్రాంతంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో షర్మిల నిరసనకు దిగారు, స్థానిక పార్టీ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన టీఆర్ఎస్ సభ్యులు ఆమె కారవాన్‌పై దాడి చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ దౌర్జన్యాలకు నిరసనగా వైఎస్‌ఆర్‌టీపీ నాయకురాలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో సోమవారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం షర్మిల కోలుకున్నారు.