బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
By Srikanth Gundamalla Published on 11 March 2024 2:27 PM ISTబీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటీవల కౌశిక్‌రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేశారు. ఈ మేరకే పోలీసులు కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులతో కలిసి ఇటీవల శ్వేత హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి. ఈ సమావేశంలోనే పోలీసులను ఉద్దేశించి కానిస్టేబుల్ నుంచి డీజపీ స్థాయి అధికారులు అయినా కబడ్దార్ మితితో సహా చెల్లిస్తామంటూ హెచ్చరించారు. అయితే.. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసుల మనోభావాలు దెబ్బతీశారంటూ పురుషోత్తం, ఆశిష్ గౌడ్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అసలేమన్నారంటే..
కరీంనగర్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన కౌశిక్‌రెడ్డి.. పోలీసులతో అయ్యేది ఏమీ లేదని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిడ్డా మిత్తితో సహా వసూలు చేస్తామన్నారు. జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాలో పోలీసులు ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు భయపెడితే భయపడేవాళ్లం కాదనీ.. అన్యాయంగా కేసులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. మీరు కూడా జైలుకు వెళ్లే రోజులు వస్తాయంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాంతో.. కౌశిక్‌పై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.