Telangana: 'మమ్మల్ని రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేయండి'.. హొంగార్డుల ధర్నా

హైదారబాద్‌ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఛలో ధర్నా చౌక్‌కు హోంగార్డులు పిలుపునిచ్చారు.

By అంజి  Published on  26 July 2023 7:34 AM GMT
Police, Home Guards,  Dharna Chowk, protest

Telangana: 'మమ్మల్ని రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేయండి'.. హొంగార్డుల ధర్నా

హైదారబాద్‌ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఛలో ధర్నా చౌక్‌కు హోంగార్డులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ధర్నా చౌక్ వద్దకు పెద్ద ఎత్తున హోంగార్డులు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్దకు చేరుకున్న హోంగార్డులను పోలీసులు ధర్నా చేయడానికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ హోంగార్డులు ధర్నా చేపట్టారు. వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు.

విషయం తెలుసుకున్న వెంటనే భారీ ఎత్తున పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇందిరా గార్డెన్ వద్ద హోంగార్డుల ధర్నా అడ్డుకొని నిరసన చేయడానికి వీలు లేదని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయంటూ, హోంగార్డులను అరెస్టు చేసి పోలీస్ వాహనంలో ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్‌కి తరలించారు. హోంగార్డులతో పాటు కారుణ్య నియామకాలు చేపట్టాలని హోంగార్డుల కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఆందోళన చేపట్టడంతో పోలీసులు వారిని కూడా అరెస్టు చేసి వాహనాల్లో పోలీస్ స్టేషన్ కి తరలించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయినా తర్వాత అసెంబ్లీ సాక్షిగా చెప్పిన హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తానని సీఎం కేసీఆర్‌ మాట ఇచ్చారు. అయితే ఆ హామీనికి కేసీఆర్‌ ఇప్పటికి అమలు చేయలేదు. దీంతో హోంగార్డు ఉద్యోగులు ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో హెంగార్డుల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటోంది.

Next Story