డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఫిజికల్‌ ఈవెంట్స్‌

Physical Tests Conducts Simultaneously For The Posts Of Si And Constable. హైదరాబాద్‌: కానిస్టేబుల్‌, ఎస్‌ఐ (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌) నియామకాలకు డిసెంబర్‌ మొదటి వారంలో దేహదారుఢ్య పరీక్షలు

By అంజి  Published on  17 Nov 2022 3:47 PM IST
డిసెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఫిజికల్‌ ఈవెంట్స్‌

హైదరాబాద్‌: కానిస్టేబుల్‌, ఎస్‌ఐ (సబ్‌ ఇన్‌స్పెక్టర్‌) నియామకాలకు డిసెంబర్‌ మొదటి వారంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నిర్ణయించింది. ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) హైదరాబాద్‌లోని 12 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం సైబరాబాద్, రాచకుంద, సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండలో కేంద్రాలను కేటాయించనున్నారు.

రాత పరీక్ష తర్వాత 25 రోజుల్లోగా రెండో దశ ప్లేస్‌మెంట్‌లను పూర్తి చేయాలని నిర్ణయించారు. దేహదారుఢ్య పరీక్ష జరిగే కేంద్రాల వద్ద ఇంటర్నెట్ సౌకర్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక మైదానంలో సగటున 130 మంది సిబ్బంది ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. నవంబర్ నెలాఖరు నుంచి ఫిజికల్ టెస్ట్ నిర్వహించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. వివిధ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు కలిపి ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ), ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్‌ (పీఎంటీ)ల కోసం 2,37,862 మంది అభ్యర్థులు పార్ట్‌-2 దరఖాస్తును అందజేశారు.

ఒక అభ్యర్థి రెండు పోస్టులకు దరఖాస్తు చేసినా.. దేహదారుఢ్య పరీక్ష ఒకేసారి నిర్వహించనున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు. ఒకసారి తీసిన రీడింగ్‌లు అన్ని విభాగాల్లోని పోస్టులకు వర్తిస్తాయని చెప్పారు. ఈ నెలాఖరులో దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకు అడ్మిట్‌కార్డులు జారీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు టీఎస్‌ఎల్పీఆర్బీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ లాగిన్‌ ఐడీల ద్వారా అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకు 3 నుంచి 5 రోజుల సమయం సరిపోతుందని రిక్రూట్‌మెంట్‌ బోర్డు భావిస్తోంది.

Next Story