విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు.. కారణం తెలిస్తే కచ్చితంగా షాకవుతారు.!

Physical education teacher beaten gurukul student in mahabubabad. ఓ విద్యార్థిని పీఈటీ ఉపాధ్యాయుడు చితకబాదాడు. కొట్టడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషించాడు.

By అంజి  Published on  21 July 2022 4:21 PM IST
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు.. కారణం తెలిస్తే కచ్చితంగా షాకవుతారు.!

చెప్పకుండా ఇంటికి వెళ్లాడని ఓ విద్యార్థిని పీఈటీ ఉపాధ్యాయుడు చితకబాదాడు. కొట్టడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషించాడు. విద్యార్థి కొట్టొద్దని ఎంత మొత్తుకున్నా ఉపాధ్యాయుడు వినలేదు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా దామరవంచలోని గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. ఓ రోజు ఇంటికి వెళ్లేటప్పుడు విద్యార్థి ఉపాధ్యాయులకు చెప్పకుండా వెళ్లాడు. అదే ఆ విద్యార్థి చేసిన నేరం.

చెప్పకుండా వెళ్లాడని పీటీఈ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని విచక్షణరహితంగా కొట్టడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషించాడు. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇదే విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముత్తయ్య మాట్లాడుతూ.. వారం రోజులు కిందట జరిగిన ఈ ఘటన వాస్తమేనని, మరోసారి ఇలాంటివి పునరావృతం కావద్దని పీఈటీని హెచ్చరించామని ఆయన తెలిపారు.


Next Story