ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి వెట్‌రన్ ప్రారంభించనున్న సీఎం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భారీ పంపులతో ఎత్తిపోతలకు సిద్ధం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 6 Sep 2023 12:07 PM GMTఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి వెట్‌రన్ ప్రారంభించనున్న సీఎం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భారీ పంపులతో ఎత్తిపోతలకు సిద్ధం అయ్యింది. ఇటీవల డ్రైన్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెట్‌రన్‌ను నిర్వహించేందుకు తెలంగాణ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్‌రన్‌ను నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ నార్లాపూర్ ఇన్‌టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి దీన్ని ప్రారంభించనున్నారు. వెట్‌రన్‌లో భాగంగా రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోయనున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వెట్‌రన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆరర్ పాల్గొంటారు. వెట్‌రన్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ భారీ బహిరంగ సభకు పాలమూరు-రంగారెడ్డి జిల్లాల్లోని పల్లెపల్లె నుంచి ప్రజలు, గ్రామ సర్పంచులు హాజరుకానున్నారు. ఎత్తిపోతల కృష్ణమ్మ జలాలను కలశాలతో ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఈ నెల 17న ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి గ్రామంలో దేవుళ్ల పాదాలకు అభిషేకం చేయనున్నారు.
సెప్టెంబర్ 16వ తారీఖు దక్షిణ తెలంగాణ ప్రజలకు పండగ రోజు లాంటిది అని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు తొలి కొలిక్కి వచ్చినందుకు గ్రామాల్లోని దేవాలయాల్లో స్వామివారి పాదాలను పాలమూరు జలాలతో అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుందామని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నో మొక్కులు మొక్కితే, ఇంజినీక్ల కృషి, దైవకృపతో ప్రాజెక్టుకు అడ్డంకులు అధిగమించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన విధంగానే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని అన్నారు సీఎం కేసీఆర్. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కొలిక్కి తేవడానికి జరిగిన కృషి లో కీలక పాత్ర పోషించిన సీఎంఓ అధికారులకు, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణలోని పల్లెపల్లెకు తాగునీరు, సాగునీరు అందనున్నదని, బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.