పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు కేటీఆర్ భరోసా

పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద సాహితీ ముద్దుబిడ్డ అయిన దర్శనం మొగులయ్యకు భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్..

By -  అంజి
Published on : 18 Oct 2025 6:04 PM IST

Padma Sree, Darshanam Mogulaiah, Brs Working President KTR

పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు కేటీఆర్ భరోసా

పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద సాహితీ ముద్దుబిడ్డ అయిన దర్శనం మొగులయ్యకు భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మొగులయ్య ఈరోజు కేటీఆర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొగులయ్య తన కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్, మొగులయ్యకు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌లో పూర్తి చికిత్సను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అనంతరం మొగులయ్య గత ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన భూమిని తనకు ఉచితంగా అందిస్తే దీన్ని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాను కట్టుకున్న గోడలను ఇంటిని కూడా కులగోట్టారని, కోర్టు కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. మొగులయ్యకు గతంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం కేటాయించిన భూమి విషయంలో కొందరు వ్యక్తులు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్‌కు తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, మొగులయ్యకు న్యాయం చేయాలని కోరారు.

Next Story