థాంక్యూ మేడమ్‌.. గుర్రపు బగ్గీపై ఊరేగిస్తూ ప్రిన్సిపాల్‌కు వీడ్కోలు

ఉస్మానియా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు కూడా తమ ప్రిన్సిపాల్‌ పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  23 Jan 2024 12:15 PM GMT
osmania medical college, principal, shashikala, retirement,

థాంక్యూ మేడమ్‌.. గుర్రపు బగ్గీపై ఊరేగిస్తూ ప్రిన్సిపాల్‌కు వీడ్కోలు

కొంతమంది టీచర్లు అంటే విద్యార్థులకు చాలా ఇష్టం ఉంటుంది. వారు చెప్పే పాఠాలు.. విద్యార్థులతో మెలిగిన విధానం ఇలా కొన్ని అంశాల వల్ల టీచర్లతో అటాచ్‌ అయిపోతారు. ఒకానొక సమయంలో వారు స్కూల్‌ను విడిచిపెట్టి వెళ్తుంటే కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్తులు ఉంటే. ఇంకొన్ని సార్లు వెళ్లొద్దంటూ బతిమాలుకున్న వారూ ఉన్నారు. అయితే.. తాజాగా ఉస్మానియా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు కూడా తమ ప్రిన్సిపాల్‌ పట్ల తమకున్న ప్రేమను చాటుకున్నారు.

ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ప్రిన్సిపాల్‌ పి. శశిశకళా రెడ్డి రిటైర్మెంట్‌ తీసుకున్నారు. వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న ఆమెకు విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. గర్రపు బగ్గీలో ఊరేగించారు. అంతేకాదు.. గుర్రపు బగ్గీ ముందు స్వయంగా విద్యార్థులే డోలుబాజాలు మోగించారు. శశికళరెడ్డికి వీడ్కోలు పలికారు. థాంక్యూ మేడమ్ అంటూ ఇంకొందరు విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శించారు. గత ఐదున్నరేళ్లుగా ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌గా శశికళరెడ్డి అందించిన సేవలను గుర్తు చేసుకుని మెడికో విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు.

తమ ప్రిన్సిపల్‌ చాలా నిజాయితీ గల వ్యక్తి అంటూ వారు చెప్పారు. అలాంటి ప్రినసిపాల్‌ను ఎక్కడా ఎవరూ చూసి ఉండరని ఉస్మానియా మెడికల్ కాలేజ్‌ విద్యార్థులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను నిజాయితీగా ఖర్చు పెట్టి కాలేజీ క్యాంపస్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారనీ.. అంతేకాక తన సొంత డబ్బులను కూడా వెచ్చించి అభివృద్ధి చేశారని మెడికల్ విద్యార్థులు ఎమోషనల్ అయ్యారు.

Next Story