చికాగోలో తెలుగు విద్యార్థులపై కాల్పులు.. ఒకరి మృతి
One Student dies another injured in Chicago shooting.అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి
By తోట వంశీ కుమార్ Published on 24 Jan 2023 2:32 AM GMTఅమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉన్నత విద్య కోసం చికాగో వెళ్లిన తెలుగు విద్యార్థులపై నల్లజాతీయులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు.
ఉన్నత విద్యను అభ్యసించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన దేశ్‌శిష్, సాయి చరణ్, లక్ష్మణ్‌లు 10 రోజుల కిత్రం చికాగో వెళ్లారు. ఓ గదిని అద్దెకు తీసుకుని ముగ్గురు కలిసి ఉంటున్నారు. సోమవారం ముగ్గురు కలిసి వాల్ మార్ట్‌కి వెలుతుండగా కొందరు నల్ల జాతీయులు వీరిని అడ్డగించారు. వీరి వద్ద నున్న నగదును దోచుకున్నారు. అనంతరం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో విజయవాడకు చెందిన దేశ్‌శిష్, సంగారెడ్డికి చెందిన సాయి చరణ్‌లకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. మరో విద్యార్థి లక్ష్మణ్ తృటిలో తప్పించుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిని వీరిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దేశ్‌శిష్ మృతి చెందాడు. సాయిచరణ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది.
ఆందోళనలో సాయి చరణ్ తల్లిదండ్రులు
సాయి చరణ్ కాల్పుల్లో గాయపడడం వారి కుటుంబ సభ్యులను షాక్‌కు గురి చేసింది. తమ కుమారుడిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.