నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ తనిఖీ
By Medi Samrat Published on 3 Nov 2023 2:45 PM IST
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ని అధికారులు తనిఖీ చేశారు. నిజామాబాద్‌లో ఆయన కాన్వాయ్‌ని ఆపిన కేంద్ర బలగాలు నిశితంగా తనిఖీ చేశాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణవ్యాప్తంగా ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు బైంసా, ఆర్మూర్, కోరుట్ల నియోజకవర్గాల్లో సభల కోసం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ బయలుదేరారు. ఈ సమయంలో కేంద్ర బలగాల నిఘా బృందం కేసీఆర్ కాన్వాయ్‌ని తనిఖీ చేసింది. ఇటీవల మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌ల కాన్వాయ్‌లను కూడా అధికారులు తనిఖీ చేశారు.నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ తనిఖీ
Next Story